: జగన్ సీఎం కాలేడు.. రాసి పెట్టుకో!: టీడీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి


జగన్ సీఎం కాలేడని, ఇప్పుడే రాసి పెట్టుకోవచ్చు అని  ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టీడీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, ఫలితం సైకిల్ గుర్తుకే అనుకూలంగా వస్తుందని చెప్పారు. నంద్యాల ఉపఎన్నికలో ఎవరైతే గెలుస్తారో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారే గెలుస్తారని అన్నారు.

‘అది ఎలా సాధ్యం?’ అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ‘ప్రజల మూడ్ అలా వుంటుంది.. చంద్రబాబు చాణక్యుడు..ఆర్గనైజర్. ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు తపిస్తుంటారు, సేవ చేసే కెపాసిటీ ఆయనకు ఉంది. చంద్రబాబునాయుడు వల్లే రాష్ట్రం కచ్చితంగా బాగుపడుతుంది’ అని అన్నారు. ‘వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన మీరు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా.. ‘అబద్ధాలు చెప్పను. అవకాశాలు లేవు. నన్ను రాజీనామా చేయమని స్పీకర్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు..’ అని ఎస్పీవై రెడ్డి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News