: ఉపఎన్నిక ఫలితాల తర్వాత జగన్ అఘాయిత్యం చేసుకుంటాడేమో?: టీడీపీ నేత కనపర్తి
నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ అధినేత జగన్ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోననే అనుమానం కలుగుతోందని గుంటూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న జగన్ పూర్తి డిప్రెషన్ లో ఉన్నాడని, వెంటనే చికిత్స అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. తన వద్ద అవినీతి డబ్బు లేదని చెబుతున్న జగన్, జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో జగన్ ప్రసంగాలపై ఎన్నికల కమిషన్, పోలీసులు ఇంతవరకు సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.