: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్కృతి అంతా వాళ్లకు వచ్చేసింది: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్


వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్కృతి వైసీపీ వాళ్లకు వచ్చేసిందని, నాడు అసెంబ్లీలో కూడా రాజశేఖర్ రెడ్డి అదే విధంగా మాట్లాడేవారంటూ టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘సీఎం చంద్రబాబును తుపాకీతో కాల్చేయండి, ఉరి తీయండి, కాలర్ పట్టుకుని నిలదీయండి, పొడిచేస్తాను, బాంబులేస్తాను, చెప్పులతో కొడతాను, చీపుర్లు చూపెట్టండి’ అంటూ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడం సబబు కాదని హితవు పలికారు.

‘జగన్ ను విమర్శించేటప్పుడు చంద్రబాబునాయుడు ఎప్పుడైనా పరుష పదజాలం ఉపయోగించారా? జగన్ ని ఉరితీయండని, చంపేస్తానని ఎప్పుడైనా అన్నారా? జగన్ మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, లక్ష కోట్లు దోచేశారు, జైల్లో ఉన్నారనేది వాస్తవం, ఈ మూడింటినే మేము ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటాము’ అని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News