: ప్రధాని పేరిట అక్రమ వసూళ్లు.. హౌసింగ్ సొసైటీపై కేసు నమోదు!


ప్రధాని నరేంద్ర మోదీ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ హౌసింగ్ సొసైటీకి చెందిన వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. హర్యానాలోని ఫరీదాబాద్ లో నరేంద్రమోదీ విచార్ మంచ్ పేరిట జేపీ సింగ్ అనే వ్యక్తి, మరికొంత మందితో కలిసి ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ హౌసింగ్ సొసైటీ వెబ్ సైట్ లో అధ్యక్షుడు, ఇతర సభ్యులతో పాటు ప్రధాని మోదీ ఫొటోలు కూడా ఉన్నట్టు ఆ నివేదికలో సీబీఐ పేర్కొంది.

  • Loading...

More Telugu News