: జాతీయ రెజ్లర్ మృతిపై: ‘మరో నిర్లక్ష్యం.. బాధాకరం’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన!


రెండు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా జాతీయ రెజ్లర్ విశాల్ కుమార్ వర్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. ‘మరో నిర్లక్ష్యం. చుట్టూ వర్షపు నీరు నిలిచి ఉన్నరాంచీ  స్టేడియంలో విద్యుత్ షాక్ కారణంగా జాతీయ రెజ్లర్ విశాల్ కుమార్ వర్మను పోగొట్టుకున్నాం. చాలా బాధాకరం’ అని సెహ్వాగ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ అధీనంలోని స్టేడియంలో వర్షపు నీరు చేరి షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ విషయం తెలియని విశాల్ కుమార్ అక్కడికి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు.

  • Loading...

More Telugu News