: పాక్ కాల్పుల ఉల్లంఘన..భారత జవాన్ మృతి
పాకిస్థాన్ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ వద్ద మోర్టార్లతో భారత సైన్యంపై దాడులకు పాల్పడింది. భారత భద్రతా బలగాలు దీటుగా ఎదుర్కొన్నప్పటికీ ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన జవాన్ ఎన్ బీ సబ్ జగ్రామ్ సింగ్ తోమర్ (42) గా గుర్తించినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. గాయపడ్డ జవాన్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, పాకిస్థాన్ ఈ రోజు రెండు సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఈ రోజు ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.