: తిరుమల శ్రీవారికి రూ.19.16 లక్షల కారు కానుక


తిరుమ‌ల శ్రీవారికి ఓ భ‌క్తుడు రూ.19.16 లక్షల కారును కానుక‌గా ఇచ్చారు. ఆలయం ముందు కారు ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వ‌హించిన త‌రువాత ఆ కారు తాళాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామారావుకి స‌ద‌రు భ‌క్తుడు శరవణకుమార్ అందించారు. చెన్నైకి చెందిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం శ్రీవారి దర్శనానికి వచ్చాన‌ని, ఆ స‌మ‌యంలో ఓ వాహనాన్ని విరాళంగా అందిస్తానని మొక్కుకున్నాన‌ని తెలిపారు. ఈ కారును టీటీడీ అధికారులు తిరుమల రవాణా విభాగం వర్క్‌షాపుకు తరలించారు.    

  • Loading...

More Telugu News