: 1978 నుంచి యూపీలో ఈ వ్యాధి బారిన పడుతున్నారు: చిన్నారుల మరణంపై యూపీ సీఎం యోగి
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బీఆర్‌డీ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఆక్సిజన్ అందక 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మెదడువాపు వ్యాధి ఇప్పటికీ సర్కారుకి ఓ సవాలుగానే ఉందని, పరిష్కారం కనుగొంటామని అన్నారు.1978 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని శిశువులు ఈ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. అందుకు ప్రధాన కారణం అపరిశుభ్రత, బహిరంగ మలమూత్ర విసర్జనేనని అన్నారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన లేదని అన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు. ఈ ఘటనలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రాను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.