: సాక్షి న్యూస్ ఛానెల్ కు కర్నూల్ జిల్లా కలెక్టర్ నోటీసులు!


నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మునిగి తేలుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చెందిన సాక్షి ఛానెల్‌కి ఈ రోజు క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ నోటీసులు జారీ చేశారు. నంద్యాల‌లో జ‌గ‌న్ చేస్తోన్న ప్ర‌చారాన్ని ఆ ఛానెల్‌లో నిరంత‌రాయంగా ప్ర‌సారం చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఇది నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని చెప్పారు. ఒకే వ్య‌క్తిని నిరంతరాయంగా చూప‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. ఈ అంశంపై రెండు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న ఆదేశించారు.    

  • Loading...

More Telugu News