: ఏపీలో ఎక్కడా ఉల్లి కొరత లేకుండా చూడాలి: సీఎం చంద్రబాబు ఆదేశాలు


ఏపీలో ఎక్కడా ఉల్లిపాయల కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉల్లి ధరల పెరుగుదలపై అమరావతిలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. అగ్రికల్చర్, సివిల్ సప్లై, మార్కెటింగ్ కమిషనర్లు, రైతు బజార్ల సీఈఓ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉల్లి ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని, అవసరమైతే సబ్సిడీ ఇచ్చి రైతు బజారులో అమ్మేలా చూడాలని, రాష్ట్రంలో ఎక్కడా ఉల్లి కొరత ఉండేందుకు వీలు లేదని, అవసరమైతే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ల నుంచి ఉల్లి దిగుమతికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. 

  • Loading...

More Telugu News