: అమెరికా అదుర్స్
శబ్ధ వేగంకన్నా ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాన్ని అమెరికా రూపొందించింది. అంతేకాదు దాదాపు మూడున్నర నిముషాల పాటు దీన్ని నడిపి రికార్డు సృష్టించింది. 'ఎక్స్`51ఎ వేవ్ రైడర్'గా పిలుచుకునే ఈ విమానం లక్షల డాలర్ల విలువైంది. దీన్ని బోయింగ్ సంస్థ రూపొందించింది. శబ్ద వేగంకన్నా ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించేందుకు దీనికి స్క్రామ్‌జెట్ ఇంజన్‌ను అమర్చారు.
4.3 మీటర్ల పొడవున్న ఈ మానవరహిత విమానం మే 1న పసిఫిక్ మహాసముద్రంపై తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆరు నిముషాలకే తన గరిష్ట వేగాన్ని అందుకుంది. మొత్తం ఆరు నిముషాలకు పైగా సాగిన ఈ వేగవంతమైన ప్రయాణంలో ఈ విమానం 230 నాటికల్ మైళ్లను అధిగమించింది. ఓవైపు సౌరశక్తితో నడిచే విమానాన్ని నడుపుతూ మరోవైపు ఈ అత్యంత వేగవంతమైన విమానాన్ని నడుపుతున్న అమెరికాకు హేట్సాఫ్.