: ‘బిగ్ బాస్’ షో లో ఎంట్రీ ఇవ్వనున్న నటుడు నవదీప్!


జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో లో వారానికి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్న విషయం తెలిసిందే. కంటెస్టెంట్ల సంఖ్య తగ్గే కొద్దీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొకరు ప్రవేశిస్తుంటారు. గత వారం సమీర్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో, ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎవరు ప్రవేశిస్తారనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఈ క్రమంలో యువ నటుడు నవదీప్ అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News