: పదవీ కాంక్షతో జగన్ రగిలిపోతున్నారు: ఏపీ మంత్రి దేవినేని ఉమా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సర్కారును నిందిస్తూ చేస్తోన్న వ్యాఖ్యలను జగన్ ఇకనైనా మానుకోవాలని ఆయన అన్నారు. పదవీ కాంక్షతోనే జగన్ రగిలిపోతున్నారని అన్నారు.
ప్రతిపక్ష నేతగా జగన్ ఏపీ అభివృద్ధిలో ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌కు అధికారంలోకి రావాలన్న పిచ్చి పట్టినట్టుందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ పాలనలో పట్టిసీమ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటితో రైతులు ఆనందంగా పంటలు పండించుకుంటున్నారని ఆయన అన్నారు. జగన్ కి క్యూసెక్కులు, టీఎంసీలకు కూడా తేడా తెలియదని ఆయన అన్నారు.