: సోనియా మంచి చేసినప్పటికీ... కిరణ్ వల్ల డ్యామేజీ జరిగింది: కుంతియా
కాంగ్రెస్ పార్టీ నేతగా కాకుండా ఓ సామాన్య కార్యకర్తగా తాను హైదరాబాదుకు వచ్చానని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా తెలిపారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ తనకు కొత్త కాదని... రాష్ట్రంలోని ప్రతి మండలానికి వెళ్తానని తెలిపారు. ప్రజల ముందు ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ పెడతామని చెప్పారు. పూర్తి అధికారాలతోనే తనను రాహుల్ గాంధీ ఇక్కడకు పంపించారని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నప్పటికీ... అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యతిరేక ప్రకటనల వల్ల తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయామని చెప్పారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు.