: ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా
శ్రీలంకలోని కాండీలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ 119, కేఎల్ రాహుల్ 85, ఛటేశ్వర పుజారా 8, విరాట్ కోహ్లీ 42, రహానే 17 పరుగుల వ్యక్తి గత స్కోర్ల వద్ద అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ 28 పరుగులతో, సాహా 7 పరుగులతో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో పుష్పకుమారా మూడు వికెట్లు తీయగా, శాండకన్ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 85 ఓవర్లకి 315గా ఉంది.