: హెచ్‌1బీ వీసా విధానం కింద తప్పుడు వీసా పత్రాలు.. భారత అమెరికన్‌కు మూడేళ్ల జైలు


భారతీయ సంతతికి చెందిన రోహిత్‌ సక్సేనా అనే వ్యాపారికి అమెరికాలోని ఫెడ‌ర‌ల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష‌, 40,000 అమెరికా డాలర్ల జరిమానా విధించింది. ఆయ‌న ‘స్యాక్స్‌ ఐటీ గ్రూప్‌ ఎల్‌ఎల్‌సీ’ పేరిట ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. అమెరికాలోని సంస్థ‌ల్లో ప‌నిచేయ‌డానికి ఆయ‌న విదేశీ కార్మికులను తీసుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకునేవారు. అయితే, హెచ్‌1బీ వీసా విధానం కింద ఆయ‌న‌ తప్పుడు వీసా పత్రాలు సమర్పించడంతో విచార‌ణ చేప‌ట్టిన ఫెడర‌ల్ కోర్టు ఆయ‌నను దోషిగా తేల్చి ఈ శిక్ష విధించింది.

స‌ద‌రు వ్యాపారి కాలిఫోర్నియా రాష్ట్రం క్యూపర్టినోలోని ఓ సంస్థలో ప‌నిచేయ‌డానికి విదేశాల నుంచి కార్మికులను నియమిస్తున్నట్లు 45 మోసపూరిత వీసా దరఖాస్తులు దాఖలు చేశాడు. 2014 మార్చి నుంచి 2015 డిసెంబరు మధ్య అమెరికా పౌరసత్వం, యూఎస్‌సీఐసీ కింద ఆయ‌న ఆయా ద‌రఖాస్తుల‌ను దాఖ‌లు చేసిన‌ట్లు అక్క‌డి అధికారులు చెప్పారు. క్యూపర్టినో కంపెనీ విదేశీ కార్మికులను తమ సంస్థలో నియమించుకోవడం లేదని స్ప‌ష్టం చేసింది. దీంతో స‌ద‌రు వ్యాపారి నేరం బ‌య‌ట‌ప‌డింది.   

  • Loading...

More Telugu News