: స్పైడర్ సినిమా టీజర్ కు కోటిన్నర డిజిటల్ వ్యూస్!
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన మహేశ్‌బాబు నటిస్తోన్న స్పైడర్ సినిమా టీజర్ అత్యధిక వ్యూస్ తో దూసుకెళుతోంది. ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ టీజర్ కి అప్పుడే కోటిన్నర డిజిటల్ వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ వీడియోల్లోనూ టాప్ ప్లేస్‌లో ఉంది. తమిళ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగా ఆసక్తిగా ఉన్నారో ఈ సినిమా టీజర్ కు వస్తోన్న స్పందన బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమిళ హీరో భరత్ విలన్‌గా నటిస్తున్నాడు.