: వైసీపీకి గుడ్ బై చెప్పనున్న రాష్ట్ర కార్యదర్శి గుత్తుల!
వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు సర్వం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన గుత్తులను పార్టీలో చేర్చుకుంటే... ఆ సామాజికవర్గానికి చెందిన ఓటు బ్యాంకును సొంతం చేసుకోవచ్చని భావించిన టీడీపీ నేతలు... ఆయనను ఒప్పించడంలో సఫలమయ్యారు.
మంత్రులు యనమల, చినరాజప్ప, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుల సమక్షంలో మంతనాలు జరిగాయి. ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు టీడీపీలో చేరడానికి ఆయన ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. 14వ తేదీ ఉదయం 7 గంటలకు ముమ్మిడివరం నుంచి 8 బస్సులు, 60 కార్లతో బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు ఆయన వెంట అమరావతికి వెళ్లనున్నారు.