: శరద్ యాదవ్ కు షాక్.. జేడీయూ రాజ్యసభ పక్షనేతగా తొలగింపు!
అవినీతి మసి అంటుకున్న ఆర్జేడీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీతో చేతులుకలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఇటీవలే పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నితీశ్ కుమార్‌ను తమ పార్టీ నుంచి తొలగిస్తామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే, శరద్ యాదవ్‌కు జేడీయూ నేతలు ఈ రోజు షాక్ ఇచ్చారు. రాజ్యసభలో జేడీయూ పక్షనేతగా ఆయనను తొలగించారు. శరద్ యాదవ్ స్థానంలో ఆర్సీపీ సింగ్‌ను ఎన్నుకున్నారు. ఈ మేరకు జేడీయూ ఎంపీలు ఈ రోజు ఉదయం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసి ఓ లేఖ అందించారు.