: ఏపీకి భారీ వర్ష సూచన.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం!
హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన చేశారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడుతుందని చెప్పారు. వచ్చే నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.