: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్ లో అసభ్య వీడియో కలకలం!


జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్ లో అసభ్య వీడియో కలకలం సృష్టిస్తోంది. కార్పొరేటర్ కిలారి మనోహర్ ఫోన్ నుంచి ఈ వీడియో అప్ లోడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో మహిళా కార్పొరేటర్లు ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని సద్దుమణిగేలా గ్రేటర్ పెద్దలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ విషయమై కార్పొరేటర్ కిలారి మనోహర్ వివరణ ఇస్తూ, ఈ అసభ్య వీడియోను తన డ్రైవర్ అప్ లోడ్ చేశాడని అంటున్నారు. తన డ్రైవర్ ను ఉద్యోగంలో నుంచి తీసేయడంతోనే ఈ తప్పుడు పనికి పాల్పడ్డాడని మనోహర్ ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News