: భారత సైన్యంలోకి రోబోలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రక్షణ శాఖ
భారత సైన్యంలోకి త్వరలో రోబోలు రాబోతున్నాయి. జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు, అల్లరి మూకల రాళ్ల దాడులను ఎదుర్కోవడంలో సైన్యానికి ఈ రోబోలు సహకరిస్తాయి. ముష్కరమూకల విధ్వంసాలను అదుపు చేసే సమయంలో సైనికులకు ఎదురవుతున్న కష్టాలను తగ్గించేందుకు సైన్యం ఈ రోబోటిక్ వెపన్స్ ను వాడనుంది. తమకు 544 రోబోలు అవసరమంటూ సైనికాధికారులు పంపిన ప్రతిపాదనకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. డీఆర్డీవో గత ఎనిమిది నెలలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తోంది. విభిన్నమైనటువంటి వాతావరణ, ప్రాదేశిక పరిస్థితుల్లో పని చేస్తున్న సైనికులకు దీటుగా ఈ రోబోలను రూపొందించారు. పలు కీలక స్థావరాల వద్ద వీటిని మోహరింపజేయనున్నారు.