: ఉద్రిక్తతల నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేసిన చైనా అధ్యక్షుడు!
అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై అణ్వాయుధ దాడికి దిగుతామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేసిన నేపథ్యంలో ఆ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగిన విషయం తెలిసిందే. నిన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తరకొరియాను తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరకొరియా, అమెరికా మధ్య మాటల యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తాజాగా ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యకు శాంతియుత పరిష్కారం అవసరమని ట్రంప్‌తో ఆయన చెప్పారు. ఉద్రిక్తతలు పెరగకుండా ఇరువైపులా సంయమనం పాటించాలని సూచించారు.