: 16 ఏళ్ల వయసులోనే గవర్నర్ పదవికి పోటీ.. పిల్లలు రాజకీయాల్లోకి రావాలని పిలుపు!
అమెరికాలోని కాన్సాస్లో ఓ హైస్కూల్ విద్యార్థి ఏకంగా గవర్నర్ పదవికే పోటీ పడుతున్నాడు. పిల్లలు రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో త్వరలోనే గవర్నర్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఆ పదవికి పోటీ చేయడానికి కనీస అర్హత వయసు లేదు. దీంతో ఈ ఎన్నికలకు 16 ఏళ్ల జాక్ బర్గెసన్ అనే బాలుడు పోటీకి దిగాడు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగం చేశాడు. తాను కోరుకునేది పిల్లలు కూడా రాజకీయాల్లోకి రావాలనేనని, చిన్న వయసులో తాను గవర్నర్కు పోటీ చేస్తున్నానంటే ఎవరూ దాన్ని అర్థం చేసుకోరని అన్నాడు. కానీ, తాము ఇచ్చే సందేశాలతో ప్రజలకు పిల్లల లక్ష్యమేంటో అర్థమవుతుందని ఆశిస్తున్నానని తెలిపాడు.
ప్రజలు, పాలకులు ఇకనైనా పాత రాజకీయ సంప్రదాయాలకు ముగింపు పలకాలని, మార్పు కోసం పాటుపడాలని సదరు గవర్నర్ అభ్యర్థి పిలుపునిచ్చాడు. ఒకవేళ ఈ బాలుడు గెలిస్తే ఆ దేశ చరిత్రలోనే అతి చిన్నవయసులో గవర్నర్గా ఎన్నికైనవాడిగా రికార్డుల్లోకెక్కుతాడు.