: గోడ కట్టేసిన రాహుల్, ధావన్... పసలేని లంక బౌలింగ్!
శ్రీలంకతో ఈ ఉదయం ప్రారంభమైన చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిదానంగా నిలదొక్కుకుంది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై వికెట్లను తీయడంలో లంక బౌలర్లు విఫలమవుతున్న వేళ, ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ తమ సత్తా చాటారు. సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో పాటు, ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారీ స్కోరు దిశగా జట్టు పయనించేందుకు అవసరమైన గోడను కట్టేశారు. ప్రస్తుతం రాహుల్ 4 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి, ధావన్ 8 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి క్రీజలో ఉండగా, భారత స్కోరు 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 118 పరుగులుగా ఉంది.