: కోనసీమలో బాలయ్య... లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు బాలకృష్ణ హాజరు!


తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నేడు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ పర్యటించనున్నారు. ఎస్ యానాంలో నూతనంగా నిర్మించిన గుడిలో నేడు లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన బాలయ్య చేతుల మీదుగా సాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆయన ఎస్ యానాం చేరుకున్నారు. స్వతహాగా నరసింహస్వామి భక్తుడైన బాలకృష్ణను, విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలని గ్రామ ప్రముఖులు ఆహ్వానించగా వెంటనే తన సమ్మతిని తెలిపారట. ఇదే ప్రోగ్రామ్ లో హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప కూడా పాల్గొననున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం, స్థానిక అభిమానులతో బాలయ్య కాసేపు గడపనున్నారు.

  • Loading...

More Telugu News