: సిగ్గుచేటు: కేరళ స్కూల్ వివాదాస్పద నిర్ణయం.. తెలివైన, చదువులో వెనకబడిన విద్యార్థులకు వేర్వేరు యూనిఫాం!


కేరళలోని మలప్పరం స్కూల్ వివాదాస్పద నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైంది. పండిక్కడ్‌లోని అల్ ఫరూఖ్ ఇంగ్లిష్ స్కూల్ ఎవరూ ఊహించని రీతిలో, విస్మయ పరిచే నిర్ణయం తీసుకుంది. స్కూల్లోని తెలివైన విద్యార్థులకు ఓ రకమైన డ్రెస్ కోడ్, తెలివితక్కువ విద్యార్థులకు  మరో రకమైన డ్రెస్‌కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది. తెలివైన విద్యార్థులు తెలుపు యూనిఫాం, చదువులో వెనకబడిన వారికి ఎరుపు గళ్లున్న చొక్కాను యూనిఫాంగా ధరించాలని ఆదేశించింది. స్కూలు తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్పందించిన యాజమాన్యం ఇలా చేయడం వల్ల చదువులో వెనకబడిన విద్యార్థులు మరింత పట్టుదలగా చదివే అవకాశం ఉందని పేర్కొంది. విద్యార్థుల్లో పోటీని  పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రిన్సిపాల్  తెలిపారు.

స్కూలు నిర్ణయంపై విద్యార్థులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి తన యూనిఫాం కుట్టే టైలర్‌ కూడా ‘‘నువ్వు బ్యాడ్ స్టూడెంట్‌వా?’’ అని ప్రశ్నిస్తాడని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. పాఠశాలలో ఇటువంటి వివక్ష పిల్లల మనస్తత్వంపై పెను ప్రభావం చూపిస్తుందని చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ అన్వర్ కరకాదన్ తెలిపారు. యూనిఫాంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఈ నిబంధనను తెరపైకి తెచ్చిన ప్రిన్సిపాల్‌ను తక్షణమే తొలగిస్తున్నట్టు స్కూల్ చైర్మన్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News