: నకిలీ ఖాతాల పీకే... ఆధారాలు సేకరించిన టీడీపీ!


2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించేందుకు వ్యూహాలు పన్నుతున్న ప్రశాంత్ కిశోర్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. సోషల్ మీడియాలో వేల కొద్దీ నకిలీ ఖాతాలను తెరచి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన పోస్టులు పెట్టిస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను ఇప్పటికే సేకరించిన తెలుగుదేశం పార్టీ, ఆయనపై సైబర్ చట్టాల కింద కేసు పెట్టాలని భావిస్తోంది.

కాగా, పీకేపై యూపీ ఎన్నికల సమయంలో ఏడు కేసులు నమోదు కాగా, వాటిల్లో సైబర్ నేరాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం నేతలు, ఆ కేసుల వివరాలను తెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలను పరిశీలించిన తరవాత కేసులు పెట్టాలన్నది టీడీపీ నేతల యోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News