: ‘అక్సర్ 2’లో మాజీ క్రికెటర్ శ్రీశాంత్!


తనపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించడంతో రియాలిటీ షోలు, సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భారత క్రికెట్ బోర్డు తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఇటీవల కేరళ హైకోర్టు ఎత్తివేయడంతో మంచి ఊపు మీదున్న శ్రీశాంత్‌, తాజాగా ‘అక్సర్ 2’ సినిమా ఛాన్స్ తో సంతోషంగా ఉన్నాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ మాట్లాడుతూ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపాడు.

అక్సర్ 2 సినిమాలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడిన తర్వాత ఇప్పటి వరకు తనకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. 2006లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘అక్సర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు అనంత్ నారాయణ్ మాధవన్ దర్శకత్వం వహించనున్నాడు. గౌతమ్ రోడ్, జరీన్ ఖాన్, అభినవ్ శుక్లా, మోహిత్ మాదాన్, శ్రీశాంత్ తదితరులు నటించనున్నారు.

  • Loading...

More Telugu News