: రిలయన్స్ జియో తాజా రికార్డిది!
4జీ సేవలను అత్యంత తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చి ఇండియాలో సరికొత్త టెలికం విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో మరో రికార్డును సొంతం చేసుకుంది. జియో అందించే 'మై జియో' యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేసే యాప్స్ ఉచిత డౌన్ లోడ్ లో 'మై జియో' తొమ్మిదో స్థానంలో నిలవడంతో పాటు కేవలం ఏడాది వ్యవధిలోనే జియో ఈ రికార్డును సాధించింది.
కాగా, ఈ యాప్ ను వాడుతూ రిలయన్స్ జియో కస్టమర్లు రీచార్జ్ తో పాటు బ్యాలెన్స్ తదితరాలను చెక్ చేసుకోవచ్చు. ఇండియాలో తయారైన మొబైల్ యాప్ లలో 10 కోట్ల మైలురాయిని తాకిన రెండో యాప్ ఇదే కావడం గమనార్హం. ఇక జియో మ్యూజిక్, జియో సినిమా, జియో మనీ వ్యాలెట్, జియో చాట్ తదితర యాప్ లన్నీ కోటికి పైగా డౌన్ లోడ్ లను సాధించాయి.