: ఆనాడు జార్జ్ బుష్ కల్పించుకుని ఉంటే.. ఈనాడు ఉత్తరకొరియా ఇలా విర్రవీగేది కాదు!


ఉత్తర కొరియా దేశం అమెరికాను బెదిరించే స్థాయికి వచ్చిందంటే తనకు నమ్మశక్యం కాకుండా ఉందని 2007లో రక్షణ శాఖ కార్యదర్శిగా, అంతకుముందు ఉత్తర కొరియాలో అమెరికా రాయబారిగా పని చేసిన విలియమ్ పెర్రీ వ్యాఖ్యానించారు. తాను ఉత్తర కొరియాలో గడిపిన వేళ తనకు కనిపించిన ఉత్తర కొరియాకు, ఇప్పుడున్న దేశానికీ పోలిక లేదని ఆయన అన్నారు. కరవు, కాటకాలతో అల్లాడే పేద దేశమైన ఉత్తర కొరియా, నేడు అణు బాంబులు తయారు చేస్తూ, యూఎస్ నే బెదిరించాలని చూస్తోందని అన్నారు.

2000 సంవత్సరంలో జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వేళ, ఉత్తర కొరియాతో చర్చలు జరిపే అంశం చర్చకు వచ్చినప్పటికీ, దానికాయన నిరాకరించారని గుర్తు చేసిన విలియమ్ పెర్రీ, అప్పటి నుంచే ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని విస్తృతం చేసిందని తెలిపారు. ఇక అమెరికా ఓ చిన్న సైనిక దాడి జరిపినా ఉత్తర కొరియాకు పెను నష్టమేనని వ్యాఖ్యానించిన ఆయన, ఆనాడు బుష్ ఉత్తర కొరియాను అణచిచేసి వుంటే ఇప్పుడిలా మాట్లాడే పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News