: నా కుమార్తె హైదరాబాద్ వెళుతోంది: డొనాల్డ్ ట్రంప్
మరో మూడు నెలల తరువాత హైదరాబాద్ నగరంలో జరిగే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు తన కుమార్తె హాజరు కానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఉంచారు. అమెరికా ప్రతినిధుల బృందానికి ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహించనున్నారని, ఇది ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్తల ప్రాతినిధ్యానికి సంకేతమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ ట్వీట్ చేశారు.
కాగా, ప్రస్తుతం ఇవాంకా ట్రంప్ తన తండ్రికి సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ 28 నుంచి భాగ్యనగరిలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు జరగనుండగా, దీన్ని విజయవంతం చేస్తామని, ఇవాంకాకు మరచిపోలేని ఆతిథ్యం ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.