: మాట నిలబెట్టుకోని చంద్రబాబును ప్రశ్నిస్తూనే ఉంటా: వైఎస్ జగన్
మాట నిలబెట్టుకోని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూనే ఉంటానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. నంద్యాలలోని పోలూరులో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్లను ఉరి తీసినా తప్పులేదని మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్లు తన దిష్టిబొమ్మను తగలబెడుతున్నారని మండిపడ్డ జగన్, అవాస్తవాలు చెప్పే టీవీ, పత్రిక తనకు లేవని అన్నారు. కాగా, చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ నేతలు నేడు మౌన ప్రదర్శనకు దిగారు.