: కోడిగుడ్లలో క్రిములను చంపే ఫిప్రోనిల్ రసాయనం.. వణికిపోతున్న యురోపియన్లు
యూరప్‌లో క్రిమిసంహారక మందు ఫిప్రోనిల్ వల్ల కోడుగుడ్లు కలుషితమైనట్లు తెలియడంతో ఆ ఖండంలోని 15 దేశాల ప్రజలు గుడ్లంటేనే భయపడిపోతున్నారు. బ్రిటన్ దిగుమతి చేసుకున్న దాదాపు 10 లక్షల గుడ్లను వెనక్కి పంపించింది. ఆహార భద్రతా అధికారులు గుడ్లను తినకూడదని ఆదేశాలు జారీ చేశారు. చికెన్ ఫామౌస్‌ల నుంచి వస్తున్న గుడ్ల వల్లే ఈ క్రిమిసంహారక మందు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు తేల్చారు. ఆ మందు ప్రభావం వల్ల మనుషుల్లో లివర్, కిడ్నీ, థైరాయిడ్ కు సంబంధించిన వ్యాధులు వస్తాయని అన్నారు. యూరప్‌లోని నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఈ క్రిమిసంహారక మందు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.