: వైఎస్ జగన్ తో చంద్రబాబుకు ప్రాణహాని ఉంది: టీడీపీ నేత అవినాష్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల కలకలం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ వల్ల చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు సాయంత్రం డీజీపీ సాంబశివరావును కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో టీడీపీ నేతలు దేవినేని అవినాష్, కడియాల బుచ్చిబాబు ఉన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల సభలో చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. జగన్ నేరచరిత్ర ఉన్న వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు.