: ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం... మెదడువాపు వ్యాధితో 30 మంది చిన్నారుల మృతి
ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మెదడువాపు వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న 30 మంది చిన్నారులు మృతి చెందారు. వీరంతా 48 గంటల వ్యవధిలోనే చనిపోయారని అక్కడి ప్రభుత్వ అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. వారంతా గోరఖ్ పూర్‌లోని బీడీఎస్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ చిన్నారుల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.