: టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యులకు తీపి కబురు!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)కి తీపి కబురు. చైర్మన్, సభ్యుల జీతాలను మూడింతలు పెంచుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రస్తుతం కమిషన్ చైర్మన్ జీతం రూ.80 వేల నుంచి రూ.2 లక్షల 25 వేలకు పెరిగింది. సభ్యులకు రూ.79 వేల నుంచి రూ. 2 లక్షల 24 వేల రూపాయలకు పెరిగింది. ఈ పెరిగిన జీతభత్యాలను 2016 జనవరి 1 నుంచి వర్తిస్తాయి.