: అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారు జామున ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోందని అన్నారు. ఈ రోజు తెల్లవారు జామున గోడ దూకి వారి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారని తెలిపారు. ఆ సమయంలో బాధితురాళ్ల సోదరుడు, తండ్రి నిద్రలో ఉన్నారని తెలిపారు. బాధితురాళ్ల వయసు 19 ఏళ్లలోపే ఉంటుందని చెప్పారు. దుండగుల కోసం గాలింపును ప్రారంభించామని అన్నారు.