: చెన్నైలో లాడ్జిలో ఉరివేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
చెన్నైలోని తొరైపక్కంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోన్న అరవింద్‌కుమార్ (25) అనే టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై నగరంలోని ఓ లాడ్జిలో బసచేసిన అరవింద్ కుమార్ నిన్న రాత్రి ఫ్యానుకి ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం అరవింద్ ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో కిటికీలోంచి చూసిన లాడ్జి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి, అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలితో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.