: బాలకృష్ణ ‘పైసా వసూల్’ సినిమా మేకింగ్ వీడియో విడుదల
బాలకృష్ణ పైసా వసూల్ సినిమా మేకింగ్ వీడియోను ఈ రోజు ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో ముఖ్యంగా బాలకృష్ణ చేస్తోన్న ఫైట్స్, సాహసాలు కనపడుతున్నాయి. పైసా వసూల్ మేకింగ్ ఆఫ్ స్టంపర్ 101 అంటూ విడుదల చేసిన ఈ వీడియోను దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 'నేను బాలకృష్ణ అభిమానిని, ఇప్పుడు నాకు 101 జ్వరం ఉంది' అని పూరీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బాలకృష్ణతో తాను దిగిన ఫొటోను కూడా పోస్ట్‌చేశాడు. గౌతమి పుత్ర శాతకర్ణి తరువాత బాలకృష్ణ నటిస్తోన్న ఈ సినిమాను వచ్చేనెల 1వ తేదీన విడుదల చేయనున్నారు.