: విధుల్లో ఉన్న‌ ట్రాఫిక్ పోలీసును కొట్టిన వాహ‌న‌దారుడు.... సీసీ టీవీలో రికార్డు!


ముంబైలోని వాసాయ్ ప్రాంతంలోని పార్వ‌తి క్రాస్‌ ట్రాఫిక్ జంక్ష‌న్ వ‌ద్ద నియ‌మాలు అతిక్ర‌మించి సిగ్న‌ల్ జంప్ చేసిన బైక్‌ను అక్క‌డి ట్రాఫిక్ పోలీసు ఆపాడు. వెంట‌నే బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి దిగి ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసి, రెండు సార్లు చెంప దెబ్బ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బైక్ మీద త‌న భార్య‌, కొడుకుతో ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి ట్రాఫిక్ పోలీసు కాలూ విఠ‌ల్ ముండేపై చేయి చేసుకోవ‌డం అక్క‌డ ఉన్న‌వారంద‌రూ చూశారు. త‌ర్వాత వాళ్లంతా క‌లిసి వాహ‌న‌దారుణ్ని పోలీసుల‌కు అప్ప‌గించారు. తాను ఏ త‌ప్పు చేయ‌కున్నా, ట్రాఫిక్ పోలీసు ఆపినందుకు కోపంలో చేయి చేసుకున్నాన‌ని వాహ‌న‌దారుడు చెప్పాడు. అయితే అత‌నిపై డ్యూటీలో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగిని కొట్టినందుకు సెక్ష‌న్ 186 కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు మానిక్‌పూర్ పోలీసు అధికారి అనిల్ పాటిల్ చెప్పాడు.

  • Loading...

More Telugu News