: కారు దిగే ప్రసక్తే లేదు.. ఇలాంటి రాతలు కావాలనే రాస్తున్నారు: డీఎస్
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మళ్లీ సొంతగూడు కాంగ్రెస్ పార్టీలోకే చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలను రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఖండించారు. పార్టీ మారుతున్నానంటూ తనపై కొందరు కావాలనే రాస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను కారు దిగే ప్రసక్తే లేదని అన్నారు. తాను టీఆర్ఎస్ ను వీడటం లేదని స్పష్టంగా చెప్పినప్పటకీ... అవే వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం వార్తలను రాస్తూ, జర్నలిజం విలువను దెబ్బతీయవద్దని సూచించారు. కొన్ని పత్రికలు, వార్తా చానళ్లు పనికట్టుకుని కథనాలను ప్రసారం చేయడం పరిపాటిగా మారిందని అన్నారు.