: యుద్ధానికి సిద్ధమైన ట్రంప్... రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ట్వీట్
ఉత్తర కొరియాను రెచ్చగొడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా యుద్ధానికి కావాల్సిన పనులు చక్కబెట్టుకుందని, సిద్ధంగా ఉన్నామని ఆయన ట్వీట్ చేశారు. `ఇక ఉత్తర కొరియా తెలివి తక్కువగా ప్రవర్తించడమే బాకీ.. కిమ్ జాంగ్ వేరే దారి వెతుక్కుంటారని ఆశిస్తున్నా!` అని ట్రంప్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇప్పటికే ఉత్తర కొరియా, అమెరికాల మధ్య జరుగుతున్న వాగ్యుద్ధం ఇక సోషల్ మీడియా యుద్ధంగా మారనుందా? లేక నిజమైన యుద్ధంగా మారనుందా? అని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ఇరు దేశాల అధ్యక్షులు ఒకర్ని ఒకరు రెచ్చగొట్టుకునే కామెంట్లు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నిజంగానే యుద్ధానికి సై అంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.