: నంద్యాలలో టీడీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం!
నంద్యాలలో టీడీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. నలుగురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేత బుడ్డా శేషారెడ్డి కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో శేషారెడ్డి వాహనం అటువైపు వస్తుండటంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో, వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వారి మధ్య వివాదం సద్దుమణిగింది.