: ఆంధ్ర హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన మహేశ్ బాబు
తన పుట్టిన రోజు సందర్భంగా ఉచిత ఆరోగ్య క్యాంపు ఏర్పాటు చేసి బుర్రిపాలెం గ్రామ ప్రజలకు సేవలందించినందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ వంటి వివిధ విభాగాల్లో సమస్యలపై అవగాహన కల్పించి, సాధారణ సమస్యలకు చికిత్స చేసినందుకు ఆంధ్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పీవీ రామారావుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఫొటోలతో సహా పోస్ట్ చేశారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.