: మార్కెట్లపై అమెరికా, ఉత్తర కొరియాల ఎఫెక్ట్... కుప్పకూలిన సెన్సెక్స్


అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా, రియాల్టీ, ఆటో, మెటల్, హెల్త్ కేర్ సూచీలు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్లు పతనమై 31,213కు పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 9,711కు చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
మార్క్ సాస్ ఫార్మా (6.17%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (6.14%), సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ (5.30%), టాటా గ్లోబల్ బెవరేజెస్ (5.06%), సింటెక్స్ ఇండస్ట్రీస్ (4.58%).

టాప్ లూజర్స్...
ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (-13.24%), సెంట్రల్ బ్యాంక్ (-10.66%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (-8.78%), అదానీ ట్రాన్స్ మిషన్ (-8.12%), మనప్పురం ఫైనాన్స్ (-8.03%). 

  • Loading...

More Telugu News