: ‘నేనే రాజు నేనే మంత్రి’పై దర్శకుడు రాజమౌళి ప్రశంసల జల్లు!
తేజ దర్శకత్వంలో ప్రముఖ నటుడు రానా హీరోగా ఈ రోజు విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’పై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లు చేశారు. ‘చాలా కాలం తర్వాత ఓ అర్థవంతమైన చిత్రం వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి చిత్ర బృందానికి శుభాకాంక్షలు’, ‘కాజల్ బాగుంది. కేథరిన్ కూడా. కట్టిపడేసే ప్రారంభ సన్నివేశాలు, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాలో ముఖ్యమైన భాగాలు’,‘ తేజ గారు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రతి నటి చాలా బాగా చేశారు ... నా భళ్లాలదేవాను చూసి చాలా గర్వపడుతున్నాను’ అంటూ రాజమౌళి ప్రశంసించారు. కాగా, రానా సరసన కాజల్, కేథరిన్ నటించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, శివాజీరాజా, ప్రదీప్ రావత్, నవదీప్ తదితరులు నటించారు.