: జగన్ ది రోడ్ షో కాదు.. కామెడీ షో: బుద్ధా వెంకన్న
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన రోడ్ షో కామెడీ షోలా సాగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో ఈరోజు టీడీపీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. బుద్ధా వెంకన్న నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ, లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ అని... ఇండియాలో కాబట్టి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చారని... అదే అరబ్ దేశాల్లో అయితే, జగన్ ను రోజుకొకసారి ఉరి తీసేవారని అన్నారు.