: మోదీతో చాలా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి: అమెరికా ప్ర‌క‌ట‌న


భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీతో చాలా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హెయిథర్‌ నౌర్ట్ ఈ రోజు చేసిన ఓ ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ లో మోదీ అమెరికాలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. మోదీ పర్యటనను అమెరికా తనకు దక్కిన గౌరవంగా భావించిందని కూడా హెయిథర్ అన్నారు. హైదరాబాద్ లో నవంబర్‌ 28 నుంచి మూడు రోజులపాటు జీఈఎస్‌ సదస్సు  జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకాను మోదీ ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. అమెరికా బృందానికి ఆమే నేతృత్వం వహించనున్నారు. ఈ విష‌యాన్ని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా కూడా తెలిపారు.

  • Loading...

More Telugu News