: జగన్ ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: గంటా


వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విమర్శలు గుప్పించారు. నేర చరిత్ర అనేది జగన్ డీఎన్ఏలోనే ఉందని ఆయన అన్నారు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని... ఆయనను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని చెప్పారు. జగన్ వాడుతున్న భాషను ఎవరూ వాడలేరని తెలిపారు. ఆయన తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖరరెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే కుటుంబంలోని అందరి  డీఎన్ఏ ఇదేనని... ఆ డీఎన్ఏ ఉన్నవారికి ఇలాంటి భాషే వస్తుందని అన్నారు.

 జగన్ ప్రస్తుత స్థితిని చూసి ప్రతి ఒక్కరూ జాలి పడాల్సిన పరిస్థితి ఉందని... ఆయన మెంటల్ కండిషన్ ఏమాత్రం బాగాలేదని చెప్పారు. మానసిక స్థితి సరిగా లేకపోతే మనుషులు ఉన్మాదులుగా తయారవుతారని... ఇప్పుడు జగన్ కూడా అలాగే తయారయ్యారని... తమ విశాఖపట్నంలో ఉన్న మెంటల్ హాస్పిటల్ లో ఆయనకు మానసిక చికిత్స చేయించాలని సూచించారు. 

  • Loading...

More Telugu News